25 May, 2026 | 12:31 AM

బస్సులు లేక భక్తుల ఇక్కట్లు..

03-02-2025 07:01 PM

బైంసా (విజయక్రాంతి): వసంత పంచమి వేడుకలను పురస్కరించుకొని సోమవారం బాసర వెళ్లేందుకు భక్తులకు బస్సులు సరిపోకపోవడంతో ఇబ్బందిపడ్డారు. సోమవారం కావడం పెళ్లిళ్లు ఎక్కువగా ఉండడం, వసంత పంచమి తోడు రావడంతో బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. బస్సులు లేకపోవడం వచ్చిన బస్సుల్లో భక్తులు ఎక్కేందుకు పోటీపడ్డారు. బస్టాండ్ మొత్తం ప్రయాణికులతో రద్దీగా కనిపించింది.