calender_icon.png 21 July, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ కమిటీని రద్దు చేయండి

20-07-2025 12:56:08 AM

ఎమ్మెల్యే కుంభంకు తాజ్‌పూర్‌వాసుల వినతి 

భువనగిరి రూరల్, జూలై 19: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని తాజ్‌పూర్‌లో ఉన్న లింగేశ్వర స్వామి ఆల య నూతన కమిటీని గ్రామంలో ఎవరి ప్రమేయం లేకుండా దేవాదాయ శాఖ అధికారులు నియమించారని ఆ కమిటీని రద్దుచే యాలని గ్రామస్థులు, బీఆర్‌ఎస్ జిల్లా యు వ నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డికి శనివారం వినతి పత్రం అందజేశారు.

ఎవరికి తెలియకుండా, ఎవరి ప్రమే యం లేకుండా దేవాలయ కమిటీని వెయ్య డం దారుణమన్నారు. ఆ కమిటీని రద్దుచేసి గ్రామంలోని అందరి అభిప్రాయం తీసుకొని నూతన కమిటీని వేయాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని తెలిపారు.

ఎమ్మెల్యేను కలిసిన వారిలో నాగరాజు, గిరిబాబు మైసయ్య, వెంకటేష్, గోవర్ధన్, కిరణ్ సందీప్, రామకృష్ణ, మధు, కృష్ణ, రాములు, నరసింహ, రాజు, కొండల్, భాస్కర్, మహేష్, నరసింహ, రమేష్, బాలయ్య, పోచయ్య, శంకరయ్య ఉన్నారు.