19-07-2025 08:53:03 PM
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవులా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సినాప్సిస్ వారి ఆర్థిక సహకారంతో యునైటెడ్ వే హైదరాబాద్ వారు దత్తత తీసుకొని సేవలలో భాగంగా నోట్బుక్స్, బ్యాగులు, స్టేషనరీని సంస్థ ములుగు జిల్లా కోఱి ర్డినేటర్ రమేష్ నాద్వర్యంలో విద్యార్థులకు అంది జేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగో ఆమెసీ లార్ సర్వర్ విచ్చేసి సంస్థ సేవలని అభినందించారు. విద్యార్థులు సంస్థ సేవలను వినియోగించుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంగ పాపయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యా ములు ఓదెల వేణుగోపాల్, ఉపాధ్యాయులు జమున,శ్యాం సుందర్, కవిత, రవీందర్, రమేష్ పీఈటీ కుమార్ స్వామి, సీఆర్పీ రమేష్ సంస్థ ప్రతి నిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.