19-07-2025 08:07:31 PM
లబ్ధిదారులకు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి
ఖమ్మం,(విజయక్రాంతి): ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో అత్యవసర వైద్య చికిత్స పొందిన పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.26 లక్షలు మంజూరయ్యాయి. ఈ చెక్కులను శనివారం నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ తో కలిసి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 80 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎంపీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో వేగవంతంగా చెక్కులు మంజూరవుతున్నాయని అన్నారు. పేదల ఆరోగ్యానికి భరోసానిస్తూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని చెప్పారు. అర్హులంతా సీఎంఆర్ఎఫ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.