19-07-2025 06:51:32 PM
కామారెడ్డి (విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద(Lions Club of Vivekananda) కామారెడ్డి ఆధ్వర్యంలో శనివారం నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కల్వరాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 400 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ చిలువేరి మారుతి మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి తోడ్పడే సమాజ సేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మంచి విలువలతో కూడిన విద్యా ప్రమాణాలను అందుకోవాలని లయన్స్ క్లబ్ సభ్యులు ఆకాంక్షించారు. త్వరలోనే ఆరోగ్య శిబిరాన్ని పాఠశాలలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ చిలువేరి మారుతి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కార్యదర్శి ఆంజనేయులు, సభ్యులు భూపేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.