calender_icon.png 20 July, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్

19-07-2025 10:40:08 PM

మసాయిపెట్/చేగుంట (విజయక్రాంతి): మసాయిపెట్ మండల పరిదిలోని పోతన్ పల్లి గ్రామం ఉన్న ఉన్నత ప్రభుత్వ పాఠశాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్(District Additional Collector Nagesh), ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలను ఉపాధ్యాయులు, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయులచే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, విద్యార్థుల అభివృద్ధికి బాటలు వేయాలని, ప్రైవేట్ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.