calender_icon.png 20 July, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం

19-07-2025 08:44:34 PM

జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్..

సూర్యాపేట (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్(District Education Officer Ashok) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సీతారాంపురం ఎంఎఎం ఉన్నత పాఠశాలలో దాతలు షీలా వీరేంద్రసిన్హా, ఉప్పల కిరణ్ సహకారంతో రెండు లక్షల అరవై వేల రూపాయల వ్యయంతో బాలికల కోసం నిర్మించిన మూడు టాయిలెట్స్ లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మాయిలు 150 మంది ఉన్నారని వారికి టాయిలెట్ లు సరిపోక ఇబ్బందులు పడుతున్న విషయం తెలియజేయగానే దాతలు ముందుకు వచ్చి టాయిలెట్ లు నిర్మాణం చేయడం అభినందనీయమన్నారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. తదుపరి దాతలు షీలా వీరేంద్ర సిన్హా, ఉప్పల కిరణ్ లను  డీఈఓ అశోక్  శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, సుమలత, మహేష్, కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, మురళి రాధిక తదితరులు పాల్గొన్నారు.