19-07-2025 07:05:57 PM
జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్..
ఈ సంవత్సరంలో ఒకరికి ఉరి శిక్ష,10 మందికి జీవిత ఖైది, 75 మందికి శిక్షలు విధింపు..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్ష పడే విధంగా చేసినప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయనీ ఇందుకు గాను ప్రతి కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharath Chandra Pawar) అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ లకు, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ లకి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి కేసుల్లో నిందితులకు దోషులుగా నిరూపించి శిక్షలు పడేలా పని చేయాలని అన్నారు. కోర్టు అధికారులు, ప్రాసిక్యూటర్ల సమన్వయంతో న్యాయ సలహాలు ఆడిగి పని చేయలని అన్నారు.
కేసు తుది దశలో సాక్షులను, నిందితులను, బాధితులను సమయానికి కోర్టులో హాజరు పరిచేలా చూసుకోవాలని సూచించారు. నేరస్తులకు శిక్షలు పడేలా పని చేయడంలో సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారితో పాటు కోర్టు డ్యూటీ సిబ్బందికి చాలా బాధ్యత ఉంటుందని చెప్పారు. కోర్టు కేసుల్లో నిందితులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, తద్వారా ప్రజలకు పోలీస్ శాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందని అన్నారు.
ఈ సంవత్సర కాలంలో జిల్లా వ్యాప్తంగా ఒక్కరికీ ఉరిశిక్ష పడగా 10 మందికి జీవిత ఖైదు వివిధ కేసులలో మొత్తం 75 మందికి శిక్షలు విధించడం అభినందనీయం అని అన్నారు. ఈ సందర్భంగా నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన ప్రాసిక్యూటర్ లకు, కోర్టు డ్యూటీ అధికారులకు జిల్లా యస్.పి గారు అభిందినందించి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్,డి.సి.ఆర్బి డీఎస్పీ రవి,పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు శ్రీవాణి, అఖిల, జవహర్ లాల్, రంజిత్ కుమార్, డిసిఆర్బి సిఐ శ్రీను నాయక్, యస్.ఐ వెంకట్ రెడ్డి,కోర్టు డ్యూటీ లైజెనింగ్ ఆఫీసర్ నరేందర్, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.