calender_icon.png 20 July, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ల ఫోరం కమిటీ ఎన్నిక

20-07-2025 07:30:35 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వ్యవసాయ మార్కెట్ల చైర్మన్ ల ఫోరం ఎన్నిక నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఫోరం గౌరవాధ్యక్షుడిగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంటా సంజీవ్ రెడ్డి, అధ్యక్షునిగా పరకాల మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జనగామ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, ఉపాధ్యక్షులుగా ములుగు మార్కెట్ చైర్మన్ రేగ కళ్యాణి, మహబూబాబాద్ మార్కెట్ చైర్మన్ సుధాకర్ నాయక్, నెక్కొండ మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి, కార్యదర్శిగా కొడకండ్ల మార్కెట్ చైర్మన్ నల్ల అండలు శ్రీరామ్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ ప్రతినిధి వర్గం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీ ప్రతినిధులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, చేర్యాల మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకటాచారి, స్టేషన్ ఘనపూర్ మార్కెట్ చైర్మన్ జూలకంటి లావణ్య శిరీష్ రెడ్డి, ఆత్మకూర్ మార్కెట్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, చిట్యాల మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొన్నారు.