calender_icon.png 20 July, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెల్లార్ తవ్వాకల్లో కూలిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్..

19-07-2025 11:52:52 PM

కాప్రా: కాప్రా సర్కిల్(Capra Circle) పరిధిలోని రాధికాచౌరస్తా ప్రధాన రహదారి పక్కనే చేపడుతున్న సెల్లార్ పనులకు భారీగా కురిసిన వర్షానికి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఏలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇసీఐఎల్ నుంచి రాధికచౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారిలో కొన్ని రోజుల నుండి సెల్లార్ తవ్వకాలు చేపడుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి సెల్లార్ తవ్వకం సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ కూలి గుంతలో పడింది.

మట్టి వెలికితీత పనులు జరుగుతున్నాయని, దీని వల్లే ట్రాన్స్‌ఫార్మర్ కూలి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ తొలగింపు, మరమ్మతు పనులను ప్రారంభించారు. ట్రాన్స్‌ఫార్మర్ కూలడానికి గల కారణాలపై విద్యుత్ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. సెల్లార్ నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలను పాటించారా లేదా అనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు.