calender_icon.png 21 July, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంగ్లీష్ విద్యలో ప్రాథమిక దశ నుంచే ప్రోత్సాహం

20-07-2025 08:24:58 PM

శ్రీ చైతన్య స్కూల్ “స్పెల్ బీ కార్యక్రమం..

జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఇంగ్లీషు నేర్చుకోవడం, మాట్లాడడం ఎంతో అవసరమని విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే ఆంగ్ల విద్యపై పట్టుదల పెరిగేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలని శ్రీ చైతన్య టెక్నో స్కూల్(Sri Chaitanya Techno School) జగిత్యాల బ్రాంచ్-1 ప్రిన్సిపల్ డాక్టర్ సచిన్ అన్నారు. విద్యార్థుల్లో ఆంగ్ల విద్య నైపుణ్యాలను పెంపొందించడం కోసం ఆదివారం విద్యార్థులకు స్పెల్ బి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఆంగ్ల విద్య నైపుణ్యాలను ప్రదర్శించి ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల ప్రశంసలను పొందారు. ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు నిర్వహించిన స్పెల్ బి ప్రత్యేక ఆంగ్ల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థుల మానసిక అభివృద్ధికి ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.