20-07-2025 04:35:39 PM
జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్..
కామారెడ్డి (విజయక్రాంతి): కల్తీకల్లు విక్రయిస్తున్నారని గౌడ కులస్తులపై ఎక్సైజ్ అధికారులు చేస్తున్న దాడులను ఆపాలని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యం మాఫియాకు తలోగ్గి కులవృత్తిని నిర్వీర్యం చేయవద్దన్నారు. కల్తీ జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలవడానికి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఐదు ఎకరాల స్థలం, డ్రిప్ సౌకర్యం కల్పించి ఈత చెట్లను పెంచే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్,నాయకులు ఇందూరి సిద్ధ గౌడ్, కర్రోల్ల శేఖర్ గౌడ్ , బొంబోతుల సురేష్ గౌడ్, తాటిపాముల ప్రశాంత్ గౌడ్,బాలా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.