19-07-2025 07:49:52 PM
జగిత్యాల అర్బన్,(విజయ క్రాంతి): ఎల్జి రాం హెల్త్ కేర్, వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ప్రస్తుతం ఆ సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలో శనివారం జగిత్యాల మండలం కండ్లపల్లి మోడల్ స్కూల్ లోని విద్యార్థులకు డెంటల్ క్యాంపు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్. రమణ మాట్లాడుతూ... ఎల్ జి రామ్ హెల్త్ కేర్ సొసైటీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గ్రామీణ, పట్టణ నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఆరోగ్యం పైన దృష్టి పెంచుకోవాలనే సదుద్దేశంతో దంత సంరక్షణపై దంత వైద్య నిపుణులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.