calender_icon.png 21 July, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కుటుంబ సంక్షేమ నిధి చెక్కు పంపిణీ

20-07-2025 10:43:26 PM

ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): ఏహెచ్ఎస్ బొజ్జాయిగూడెం ఆశ్రమ పాఠశాలలో సీఆర్పీగా పనిచేసి ఇటీవలే మరణించిన బానోతు మంగీలాల్ కుటుంబానికి టీఎస్ యుటిఎఫ్ కుటుంబ సంక్షేమనిధిగా రూ.6 లక్షల విరాళం చెక్కును టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి, రాష్ట్ర ఎఫ్డబ్లూఎఫ్ కార్యదర్శి నాగమల్లేశ్వర రావులు బానోత్ మంగీలాల్ కుటుంబానికి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఇల్లందు మండల అధ్యక్షులు రాంబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చావా రవి, ఎ.రాంబాబులు మాట్లాడుతూ.. ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ప్రతి ఒక్కరం అనే సహకార స్ఫూర్తితో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రతిష్టాత్మకంగా కుటుంబ సంక్షేమ నిధిని ప్రారంభించడం జరిగిందన్నారు.

టీఎస్ యుటిఎఫ్ అంటే ఒక కుటుంబమని సంఘంలో ఉన్న కార్యకర్తలకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఈపథకాన్ని ప్రవేశపెట్టబడిందనీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందనీ తెలియజేశారు. ఈ 6 లక్షల రూపాయలు పెద్దసహాయం కాదని, అత్యవసర అవసరాల కోసం ఉపయోగపడుతుందన్నారు. 10,15 సంవత్సరాలు నుండి పనిచేసే సిఆర్టిలు సిఆర్టి లాగానే మిగిలిపోయారని వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు చనిపోతే రూ.10 లక్షల ఎక్స్ గ్రెషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఇవన్నీ సాధించుకోవాలంటే పోరాటమే మార్గమన్నారు.

ఆశ్రమ పాఠశాలలో పండిట్ పీఈటి పోస్టులను అప్గ్రేడ్ చేయాలనీ 317 జీవోతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉపాధ్యాయ సమస్యలపై మూడుదశల పోరాట కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమాలను ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాజు, మండల విద్యాధికారి ఉమాశంకర్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీమోహన్, వెంకటేశ్వర్లు, రాష్ట్రకమిటీ సభ్యులు కిషోర్సింగ్, జిల్లా ఎఫ్డబ్ల్యూఎఫ్ కన్వీనర్ దాసు, జిల్లా కార్యదర్శిలు తావుర్యా, జయరాజు, ఎస్కే పాషా, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు శేషగిరిరావు, కృష్ణవేణి, కోశాధికారి అన్నపూర్ణ, ఎఫ్డబ్ల్యూఎఫ్ సభ్యులు రమేష్, టేకులపల్లి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాన్సింగ్, హరికుమార్, గుండాల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలస్వామి, రూప్సింగ్ తదితరులు పాల్గొన్నారు.