calender_icon.png 20 July, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగు నీటికి రైతులు ఇబ్బంది పడకూడదు

20-07-2025 01:19:55 AM

  1. విపత్తు నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
  2. ఆధునిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణ
  3. ఏరియల్ లిడార్ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలి 
  4. వ్యవసాయ, నీటిపారుదల అధికారులు సమన్వయం చేసుకోవాలి
  5. నీటిపారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): వానాకాలం పంటలకు సమృద్ధి గా నీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించా రు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికాబద్దంగా నీటిని అందించినందుకు అద్భుతమైన ఫలితాలు సాధించామన్నారు.

వ్యవసాయశా ఖాధికారులతో నీటిపారుదల శాఖాధికారులు సమన్వయం చేసుకున్నందునే తెలంగాణ రాష్ర్టం 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. శని వారం సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ ప్రత్యే క సమీక్షా సమావేశం నిర్వహించారు.

నీటి పారుదల శాణ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాం త్ జీవన్ పాటిల్, నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యానాథ్ దాస్, నీటిపారుదల శాఖ సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్, ఈఎన్సీలు అంజద్ హు స్సేన్, శ్రీనివాస్, రమేష్ బాబు తదితరులతో పాటు రాష్ర్టవ్యాప్తంగా ఉన్న నీటిపారుదల సీఈలు, ఎస్‌ఈలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లా డూతూ సాగునీటి అంశంలో ఏ రైతు ఇబ్బం ది పడకుండా చూసుకోవాలని సూచించా రు. నీటిపారుదల శాఖ మొత్తం దృష్టి కేంద్రీకరించి చివరి ఆయకట్టు వరకు నీరు అం దేలా చూడాలన్నారు. ఈ వర్షాకాలంలో భా రీ నుండి అతి భారీ వర్షాలు సంభవిస్తే ఎదురయ్యే పరిణామాల పట్ల ముందస్తు బం దోబస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ప్రధాన ఆనకట్టల తోపాటు జలాశయాలు, కాలువలను అధికారులు క్షేత్ర స్థాయిలో ఎ ప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశించా రు. విపత్తులు సంభవిస్తే తక్షణమే నష్ట నివారణ చర్యలకు అధికారులు అప్రమత్తంగా ఉండి బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. 

ఆధునిక సాంకేతికతో ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణ

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. సుమారు 10 కిలో మీటర్ల దూరం సొరంగమార్గం పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జీవనాడిగా మారనున్న ఎస్‌ఎల్‌బీసీ పనుల పూర్తికి రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

పునరుద్ధరణ పనులలో ఎటు వంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండేందుకు చేయనున్న ఏరియల్ లిడార్ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు ఎన్‌జీఆర్‌ఐ శాస్త్ర వేత్తలతో సమావేశమై సర్వేకు సంబంధించిన సాంకేతిక విధా నాలను రూపొందించామన్నారు. పునరుద్ధరణ వ్యయం విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

నీటి సామర్థ్యం పెంపొందించేందుకు చేపట్టిన పూడికతీత పనులను మరింత వేగవంతం చేయాలని సూచించా రు. వర్షాకాలంలో సంభవించే అతి భారీ వ ర్షాలతో ప్రమాదాలకు గురయ్యే వాటిని గుర్తించి అత్యవసరంగా పూడికతీత పనులు చేపట్టాలని చెప్పారు.

రాష్ర్టవ్యాప్తంగా అన్యాక్రాంతం అవుతున్న నీటిపారుదల శాఖ భూ ముల పరిరక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యేక డ్రైవ్‌తో నీటిపారుదల శాఖ భూములన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. శాఖాపరమైన అంశాన్ని ప్రస్తా విస్తూ పెండింగ్‌లో ఉన్న డీఈల నుండి ఈఎన్సీల వరకు వచ్చే రెండు నెలల్లో ఫించన్లు ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.