calender_icon.png 20 July, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఏసీఎస్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

20-07-2025 06:53:17 PM

సీఈఓ వూర సత్యనారాయణ..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ పీఏసీఎస్ లో రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని సీఈఓ వూర సత్యనారాయణ(CEO Voora Satyanarayana) తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, యూరియా 444 బ్యాగులు, 20:20:0:13-600 బ్యాగులు, బీపీటీ-5204 సన్నరకం విత్తనాలు 50 బ్యాగులు, ఎంటీయూ-1224 సన్నరకం 20 బ్యాగులు, కేఎన్ఎం-1638 సన్న రకం 25 బ్యాగులు, ఎంటీయూ-1010 దొడ్డు రకం 50 బ్యాగులు, ఎంటీయూ-1290 దొడ్డురకం 50 బ్యాగుల వరి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తిమ్మాపురం పీఏసీఎస్ ద్వారా అందించు సేవలు అనగా రైతులకు రుణాల మంజూరు, ఎరువులు, విత్తనాల సరఫరా లాంటివి రాజకీయాలకు తావు లేకుండా రైతులందరికీ పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సేవలను రైతులు సద్వినియోగం చేసుకొని, పీఏసీఎస్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఎల్గురి వెంకన్న, నక్కల వెంకటేశం తదితరులు ఉన్నారు.