calender_icon.png 20 July, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిషేధిత గడ్డి మందు పిచికారి.. ఎండిన మొక్కజొన్న పంట.!

19-07-2025 10:31:48 PM

- ఫర్టిలైజర్ దుకాణ యజమాని నిర్వాకంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు.

- నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో వెలుగులోకి 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నిషేధిత కలుపు (గడ్డి) మందు పిచికారి చేయడంతో ఏపుగా పెరిగిన మొక్కజొన్న పంట పూర్తిగా ఎండు ముఖం పట్టింది. ఫర్టిలైజర్ దుకాణం యజమాని మాటలు నమ్మిన రైతులు పదుల సంఖ్యలో మొక్కజొన్న పంటలను నష్టపోయారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మామిళ్ళ శ్రీను తనకున్న మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. పొలంలో కలుపు ఏపుగా పెరిగిందని ఈ నెల 8న గ్రామంలోని ఫర్టిలైజర్ దుకాణం యజమాని వద్ద పంట గురించి వివరించాడు. కానీ కొన్ని షరతులతో విక్రయించాల్సిన కలుపు మందును అర లీటర్ ₹2000 చొప్పున నిబంధనలకు విరుద్ధంగా రైతులకు అంటగట్టాడు.

అది నమ్మి పిచికారి చేసిన రైతుకు అసలు విషయం బయటపడింది. పిచికారి అనంతరం పంట పూర్తిగా ఎండు ముఖం పట్టింది. ఇలా గ్రామంలోని చాకలి బీరయ్య తోపాటు మరి కొంతమంది ఇదే విధంగా నష్టపోయారు. ఇదేంటని ఫర్టిలైజర్ దుకాణా యజమాని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని వ్యవసాయ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా అనవసరమైన పురుగు మందులు, ఎరువులు రైతులకు అంటగట్టి పంట దిగుబడిపై ప్రభావం చూపే విధంగా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ దుకాణదారులు ప్రవర్తిస్తున్నారని నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఏడిఏ పూర్ణచందర్ రెడ్డిని వివరణ కోరగా అనుమతి లేకుండా ఎలాంటి గడ్డి మందు రైతులకు విక్రయించవద్దని అలాంటి దుకాణదారులపై  లిఖితపూర్వకమైన ఫిర్యాదు చేస్తే రైతులకు న్యాయం చేస్తామన్నారు.