calender_icon.png 19 July, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం..

19-07-2025 02:22:08 PM

కోదాడ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్నేని వెంకటరత్నం బాబు

కోదాడ: ఎస్ఎస్సి పరీక్షల్లో జిల్లాస్థాయి ప్రధాన ర్యాంకుతో పాటు త్రిబుల్ ఐటీ సీటు సాధించిన పేద విద్యార్థులకు కోదాడ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్నేని వెంకటరత్నం బాబు ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత  పాఠశాలలో మండల విద్యాధికారి సలీం షరీఫ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన త్రిబుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థుల అభినందన సభలో పాల్గొని మాట్లాడారు.

కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం కోదాడ ఆధ్వర్యంలో గత ఎస్ఎస్సి పరీక్షలలో జిల్లా ప్రధమ ర్యాంకు సాధించి ట్రిపుల్ ఐటీ సీట్లు పొందిన తాళ్లూరి రేఖశ్రీకి రూ.5000, అలాగే త్రిబుల్ ఐటీ సీటు సాధించిన నరేంద్రకు రూ.5000 చొప్పున మొత్తం రూ.పదివేలను వారికి క్యాష్ బహుమతి అందించడం జరిగింది. జిల్లాస్థాయి ర్యాంకు, ట్రిపుల్  ఐటీ సీట్లు సాధించటం కోసం కృషి చేసిన ఉపాధ్యాయ సిబ్బందిని సంఘ నాయకులు అభినందించారు. భవిష్యత్తులో వివిధ రంగాల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని సంఘ నాయకులు తెలిపారు.