calender_icon.png 21 July, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం

20-07-2025 08:37:17 PM

చిగురుమామిడి (విజయక్రాంతి): చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల మరణించిన తమ్మిశెట్టి రాములు కుటుంబానికి చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయం చేశారు. పాఠశాల 1996-97 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం రేకొండలోని రాములు స్వగృహంలో అతడి కుటుంబ సభ్యులను కలిసి రూ. 61,700 ఆర్థిక సాయం అందజేశారు. రాములు కుటుంబానికి ఎల్లవేళలా తాము అండగా ఉంటామని మనోధైర్యాన్ని అందించారు.