calender_icon.png 20 July, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో మృతి చెందిన మెకానిక్ కుటుంబానికి ఆర్థిక సహాయం

19-07-2025 08:52:58 PM

హుజూర్ నగర్: పట్టణంలో ట్రాక్టర్ మెకానిక్ గా పనిచేస్తున్న రెబ్బ కృష్ణ గత వారం రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. శనివారం హుజూర్ నగర్ ఆటోమొబైల్స్, మెకానికల్ యూనియన్ నాయకులు మృతి చెందిన కృష్ణ కుటుంబానికి చేయూతని అందించేందుకు ముందుకు వచ్చారు. మెకానిక్ కృష్ణ కుమార్తె పేరిట యూనియన్ తరపున రూ.50,000/- భవిష్యత్ అవసరాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. యూనియన్ కు సంబంధించిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు గుడిపాటి అనిల్ కుమార్, ఉపేందర్, వెంకన్న,రాంబాబు, లక్ష్మీ నారాయణ, నరేష్,నరసింహరావు,శ్రీను, రాము, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.