calender_icon.png 20 July, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

20-07-2025 10:50:07 AM

హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి స్థిరంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లూ 1,56,516 క్యూసెక్కులు,  ఔట్ ఫ్లూ 87,525 క్యూసెక్కులు నీరు నిమిష నిమిషానికి పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటరీ నుంచి 20 వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,210 క్యూసెక్కులు నీటిని అధికారులు విడుదల చేశారు. 

శ్రీశైలం ఆనకట్ట మొత్తం సామర్థ్యం 885 టిఎంసి అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 882.50 టిఎంసి అడుగుల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నీటినిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు, ప్రస్తుతం 201.58 టీఎంసీ అడుగుల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ జలాశయానికి క్రమంగా వరద పెరుతుంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 566 అడుగులు, సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు ఉంది. నాగార్జునసాగర్ జలాశయం ప్రస్తుత నిల్వ 246.53 టీఎంసీలు, సాగర్ ఇన్ ఫ్లో 67,525 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,800 క్యూసెక్కులు ఉంది.