20-07-2025 12:50:30 AM
20 వేలు తీసుకుంటూ చిక్కిన వైనం
అదిలాబాద్, జూలై 19 (విజయక్రాంతి): అడవిని కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులే మామూళ్లు తీసుకుంటూ తప్పుదారి పడుతున్న ఘటన లు ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుడిహ త్నూర్ మండలం హరక్కాయి గ్రామ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విశ్వజిత్ ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న వీడియో ప్రజల కంటపడింది.
గుడిహత్నూర్ ఎక్స్ రోడ్ వద్ద పాన్ షాప్ వెనుకలా వడ్రంగి పనులు చేస్తున్న వారి నుంచి మామూళ్లు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. అటవీ ప్రాంతాల్లో గాలి, వర్షానికి పడిపోయిన చెట్ల మొద్దులను తీసుకెళ్లిన వ్యక్తులను భయబ్రాంతులకు గురి చేసి వారి నుంచి అటవీ శాఖ సిబ్బంది డబ్బులు తీసుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
బీట్ ఆఫీసర్ విశ్వజిత్ మామూళ్లు తీసుకుంటున్న ఘట నపై ఉన్నతాధికారులు విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బహిర్గత మయ్యే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.