calender_icon.png 20 July, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి

20-07-2025 07:02:14 PM

మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోనాల ఉత్సవాలు(Bonalu Festival) ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పాల్గొని పలు ఆలయాలను సందర్శించి మొక్కులను, బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లను వేడుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, ప్రభాకర్ రెడ్డి, సోమేశ్ గౌడ్, శ్రీనివాస్, ఆలయ కమిటీల సభ్యులు, ప్రజలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.