20-07-2025 12:30:34 PM
మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులు పట్టణ ప్రజలందరిపై ఉండాలని మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శ్రీశ్రీశ్రీ బుర్జు గడ్డ బంగారు మైసమ్మ బోనాల పండగ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వేద పండితుల సాక్షిగా వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విఠల్ రెడ్డి ఆంజనేయులు గౌడ్, దివ్య జ్యోతి, పిల్లి శ్రవణ్, ఆనంద్, రామేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, యాదయ్య, శివకుమార్ భక్తులు ఉన్నారు.