calender_icon.png 23 July, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమేశ్వర ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

21-07-2025 12:00:00 AM

  1. రాజన్న ఆలయ అభివృద్ధి 8మంది మంత్రులతో,సీఎం భూమి పూజ చేసుకున్నాం.

ఆలయ అభివృద్ధికి విస్తరణ కు టెండర్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

ప్రస్తుతం 150 కోట్లతో అన్ని అభివృద్ధి పూర్తి చేస్తాం.

శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ 

రాజన్న సిరిసిల్ల: జులై 20 (విజయక్రాంతి) రాజన్న ఆలయానికి 8 మంది మం త్రుల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి గత ఏడాదిలోనే భూమి పూజ చేసుకున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. భీమేశ్వర ఆలయంలో మూడు కోట్ల 44 లక్షలతో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కా ర్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఈఓ రాదాబాయి, శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఆలయం, కో డెల మొక్కుల నిలయం, అత్యంత విశిష్ఠత క లిగిన దేవాలయమని సీఎం రేవంత్ రెడ్డి,8 మంది మంత్రుల సమక్షంలో రాజన్న ఆలయ అభివృద్ధికి గత ఏడాది లో భూమి పూజ చేసుకున్నామని వివరించారు.అనేక రాష్ట్రాల నుండి వచ్చే రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నా మని 2023 బడ్జెట్ లో 50 కోట్లు,24-25 బడ్జెట్ లో వంద కోట్లు రాజన్న ఆలయం, పట్టణ అభివృద్ధి కోసం కేటాయించారని తెలిపారు.

వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా డెవలప్ చేస్తామని .ప్రభుత్వ సూచనలు సలహాలతో ఇప్పటికే వేములవాడ ప ట్టణంలో రోడ్ వెడల్పు కార్యక్రమం చేపట్టామని దానికి 47 కొట్లు కేటాయించడం జరి గిందని వివరించారు.నిర్వాసితులకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందని అన్నారు. మొదటి దశ లో లో 76 కోట్ల తో వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తున్నమని, శృంగేరి పీఠాధిపతుల, పరిరక్షణ కమిటీ సలహాలు, సూచనలు,శాస్త్ర ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఆలయ అభివృద్ధి విస్త రణకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. ఆలయ విస్తీర్ణ సమయంలో వచ్చే భక్తులకు దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రాచీన ఆలయమైన భీమేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా కూడా అభివృద్ధి చేస్తున్నామని భరోసా కల్పించారు.పురాతన కాలం నుండి రాజన్న ఆలయనికి తోడుగా భీమేశ్వర అలయం ఉం దని పురాణాల్లో చూసినట్లయితే శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఇంద్రుడు, శ్రీరాముడు, పం చ పాండవులు వచ్చి దర్శనం చేసుకుని భీమేశ్వర ఆలయంలో పూజలు చేసినట్లుగా ఉంద ని గుర్తు చేశారు.

భీమేశ్వర ఆలయాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం. రాజన్న ఆలయ విస్తరణ జరుగుతున్న సమయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భీమేశ్వ ర ఆలయంలో క్యూలైన్ల నిర్మాణం అభిషేక మండపాలు కళ్యాణ మండపాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నమన్నారు.3 కో ట్ల 44 లక్షలతో భీమేశ్వర ఆలయంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ చేశాం,ప నులు నెలరోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాము.

భీమేశ్వర ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.భీమేశ్వర స్వామి రాజన్న ఆశీస్సులు తీసుకొని నేడు శంకుస్థాపన చేశాం.వీలైనంత తొందరగా రా జన్న ఆలయ విస్తరణ చేపట్టి పనులు పూర్తి చేసి రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. రాజన్న భక్తులు, పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్న ఆలయ విస్తరణ అభివృద్ధి తొందర లోనే మీ అందరి సహాయ సహకారాలతో పూర్తి చేస్తాం.

వేములవాడ పట్టణ రాజన్న ఆలయ అభివృద్ధి సమాంతరంగా చేస్తూ ప్ర జా ప్రభుత్వం ముందుకు పోతుంది.35 కోట్ల తో అన్నదాన సత్రం నిర్మాణం కోసం టెండర్లు పూర్తి అయ్యాయి, వేములవాడ రాజన్న ఆలయంలో 76 కోట్ల చేపట్టబోయే అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి అ య్యాయి.ప్రస్తుతం 150 కోట్లతో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం.వచ్చే బడ్జెట్ లో కూడా నిధులు కేటాయింప చేసుకుని దశలవారీగా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసు కుందాం.

అందరి ఆలోచనలకు అనుగుణం గానే రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి ఉం టుంది.రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ చేసే సమయంలో రాజన్న భక్తులకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

రాజన్న ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కాంగ్రెస్ పార్టీ పట్ట ణ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.