19-07-2025 07:27:50 PM
పట్టించుకోని విద్యుత్ అధికారులు..
సబ్ స్టేషన్ కు తరలివచ్చిన వివిధ గ్రామాల ప్రజలు..
బాన్సువాడ (విజయక్రాంతి): తరచుగా విద్యుత్ అంతరాయం జరుగుతుందని విద్యుత్ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని శనివారం కామారెడ్డి జిల్లా(Kamareddy District) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో సబ్ స్టేషన్ వద్దకు ఆయా గ్రామాల ప్రజలు వచ్చి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై నిలదీశారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచుగా గ్రామాలలో మండల కేంద్రంలో విద్యుత్ అంతరాయం జరుగుతుందని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం చేయకుండా విద్యుత్ సరాపరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. సబ్ స్టేషన్ వద్దకు వచ్చి విద్యుత్ అధికారులకు విన్నవించారు. తరచుగా విద్యుత్ అంతరాయం ఏర్పడి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.