calender_icon.png 20 July, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంద్ కు సంపూర్ణ మద్దతు

20-07-2025 06:04:55 PM

ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు..

కాగజ్ నగర్ (విజయక్రాంతి): ఆదివాసీ సంఘాలు సోమవారం తలపెట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు(MLA Dr. Palvai Harish Babu) సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షం, లోపాయికారిగా, లోపభూయిష్టంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మొత్తం అటవీ ప్రాంతాలను టైగర్ కంజర్వేషన్ రిజర్వుగా ప్రకటించడం అన్యాయమన్నారు. ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇంత పెద్ద నిర్ణయం చేయడం దారుణం అన్నారు.

గ్రామ సభలు నిర్వహించకుండా, స్థానికులను సంప్రదించకుండా, ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు చేశారంటే రాష్ట్ర ప్రభుత్వంఎంత అనాలోచితంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు ఉన్నారు. ఆదివాసీ సంఘాలు ఇచ్చిన బందు పిలుపుకు మద్దతు తెలియజేస్తూ ప్రజలు, వ్యాపారస్తులతో పాటు భాజపా నాయకులు, కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం చూపే ఈ జీవో 49ను (కుమురంభీం జిల్లాను టైగర్ కంజర్వేషన్ రిజర్వుగా ప్రకటించడం) రద్దు చేసే వరకు ఈ పోరాటంలో భాగస్వామ్యులమవుతామని తెలియ చేశారు.