calender_icon.png 20 July, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ గ్రామైక్య సంఘాలకు ఫర్నిచర్ అందజేత

20-07-2025 06:07:15 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం కల్వల, అన్నారం గ్రామాల మహిళా సమాఖ్యలకు వేం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫర్నిచర్ సమకూర్చారు. మహిళా సంఘాలు గ్రామాల్లో సమావేశం నిర్వహించేందుకు అనువుగా ఫర్నిచర్ ఏర్పాటు చేసినట్లు మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి తెలిపారు. మహిళా గ్రామైక్య సంఘాలకు గ్రామాల్లో పక్కా భవనాలను నిర్మించడానికి కృషి చేస్తామని మార్కెట్ చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు కళావతి, లావణ్య, కవిత, రజిత, పద్మ, పుష్పలత, ప్రమీల, సుజాత, మీనా పాల్గొన్నారు.