12-02-2025 08:46:23 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామశాఖ అధ్యక్షుడిగా చెల్పూర్ గ్రామానికి చెందిన గన్ను అశోక్ కుమార్ ని జిల్లా అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు హుజురాబాద్ మండల అధ్యక్షుడు కిరణ్ నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ... నా నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ బాధ్యతలను బాధ్యతగా నిర్వహిస్తూ, గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సమ్మెట సంపత్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు పుల్ల రాధ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పంజాల అరవింద్, నాయకులు శనిగరపు తరుణ్, బండ లక్ష్మారెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.