calender_icon.png 21 July, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పు ఇచ్చిన వారి వేధింపులతో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్య!

20-07-2025 01:04:24 AM

  1. మేడ్చల్‌లోని లాడ్జీలో ఉరేసుకొని బలవన్మరణం

మృతుడు మెదక్‌కు చెందిన కాముని రమేశ్

ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో

నమ్మినవారే మోసం చేశారని ఆవేదన

తన కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎంకు, ఎమ్మెల్యేకు విజ్ఞప్తి

మెదక్, జూలై 19 (విజయక్రాంతి): అప్పు ఇచ్చిన వారి వేధింపులు భరించలేక మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శనివారం మేడ్చల్‌లోని ఓ లాడ్జీలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో తనను వేధింపులకు గురి చేస్తున్న వారి వివరాలను వెల్లడించారు. తన భార్యా, పిల్లలను కోర్టు కేసుల పేరుమీద వేధించవద్దని వేడుకున్నాడు.

మెదక్ పట్టణానికి చెందిన కాముని రమేశ్(52) హవేళీఘణపూర్ మండలం సర్ధన గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచే స్తున్నాడు. గతంలో రమేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోవడంతో తీవ్రస్థాయిలో అప్పులు పెరిగిపోయా యి. దీంతో అప్పులోల్ల బాధలు భరించలేక ఆస్తు లు, ఇల్లు, బంగారం అమ్మి కొందరితో సెటిల్ చేసుకున్నాడు.

ఇంకా కొంతమంది స్నేహితులకు అప్పులు ఇవ్వాల్సి ఉండగా వారు చెక్‌బౌన్స్ కేసులు వేస్తూ తన కుటుంబాన్ని రోడ్డు పాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని తీవ్ర మనస్థాపానికి గురైన రమేశ్ శనివారం మేడ్చల్లోని లాడ్జీలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహ త్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి తనను వేధిస్తున్న వారి పేర్లు వెల్లడిస్తూ తన కుటుం బం రోడ్డుపాలు కాకుండా చూడాలని సీఎం రేవంత్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ను వేడుకున్నాడు. తనను కష్టకాలంలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లిఖార్జున్గౌడ్, మాజీ కౌన్సిలర్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి ఎంతో సహకారం అందించారని తెలిపారు. 

మిత్రులే నమ్మక ద్రోహం చేశారు

కాముని రమేశ్ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో రోధిస్తూ తన కుటుంబాన్ని ఏ విధంగా వేధింపులకు గురి చేశారో వెల్లడించారు. నమ్ముకున్న మిత్రులే నమ్మక ద్రోహం చేస్తున్నారని, తాను డబ్బులు చెల్లించినా కావాలనే ప్రామిసరీ నోట్లు, చెక్ బౌన్స్ కేసులు వేశారని, డబ్బులు కూడా ఇవ్వలేదని బెదిరించారని వాపోయాడు. తనకు ఇక భరించే ఓపిక లేదని, తాను చనిపోయిన తర్వాత తన భార్యా పిల్లలను కేసుల పేరుతో వేధించవద్దని కోరారు.