calender_icon.png 20 July, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తిలో ఘనంగా ఆకారపు సుదర్శన్ వర్ధంతి వేడుకలు

20-07-2025 07:49:08 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆకారపు సుదర్శన్ 15వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు నియోజకవర్గ కన్వీనర్ ఆకారపు రమేష్ ఆధ్వర్యంలో ఆకారపు సుదర్శన్ ఘాటు వద్ద పుష్పగుచ్చాలతో ఆదివారం ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆకారపు రమేష్ మాట్లాడుతూ, తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాన్ని తెదేపా అధికారంలో అభివృద్ధి పథంలో భాగస్వామ్యం చేశారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధించాలంటే టీడీపీతో సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి టిడిపి పార్టీ ఎన్నికల పరిశీలికుడు రాంబనేష్ బోనగిరి అడక్ కమిటీ నెంబర్ పులుసు శేఖర్ గౌడ్ సూర్యాపేట జిల్లా నాయకులు దండంపెల్లి నరేష్ గౌడ్ మోత్కూర్ ప్రధాన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మహేశ్వర వెంకటేశ్వర్లు మోత్కూర్ పట్టణ అధ్యక్షులు ఎండి గాలిబ్ శాలిగౌరారం మండల పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ నూతనకల్ మండల పార్టీ అధ్యక్షుడు వేల్పుల చంద్రయ్య మద్దిరాల మండల పార్టీ అధ్యక్షుడు జలగం నరేష్ గౌడ్ మద్దిరాల గ్రామ శాఖ అధ్యక్షులు బొండేకోల శివ సిల్వేరి లింగరాజు తదితిరులు పాల్గొన్నారు.