calender_icon.png 21 July, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంబురంగా పోచమ్మ బోనాలు

20-07-2025 08:15:02 PM

తిమ్మాపూర్ (విజయక్రాంతి): మండలం కేంద్రంలో పెరిక(పురగిరి క్షత్రియ) సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాల జాతర(Bonalu festival) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఇంటికో బోనం పసుపు కుంకుమతో వేప ఆకులతో అలంకరించి డప్పు చప్పుళ్ళ మధ్య ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. గ్రామదేవతకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆషాడ మాసంలో ఏటా పోచమ్మ బోనాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో విలసిల్లాలని గ్రామ దేవతను మొక్కుకున్నరు. ఈ కార్యక్రమంలో పోతరాజు దేవేందర్, మాదన రాజేందర్, దుండే  వీరశేఖర్, చింతం రాజు, దుండే శ్రీను,మీస విజయ్, రాజు ,చింతం అనుషివ, మాదన శ్రీను, మాదన వీరయ్య, మీస శ్రీను, దుండే సతీష్, మొగిలి, రాజయ్య, లక్ష్మయ్య,  శ్రీనివాస్, ఆనంద్, కొమురెళ్లి, మీస అపర్ణ, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.