19-07-2025 08:31:20 PM
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి,(విజయక్రాంతి): ఉద్యానవన మండల సాగుతో అధిక లాభాలు ఉంటాయని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శనివారం బోయినపల్లి మండలం మరల పేట గ్రామంలో పామాయిల్ సాగు ఉద్యానవన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీని చెక్కులను అందించారు.
అనంతరం ఎమ్మెల్యే మెడికల్ సత్యం మాట్లాడుతూ వ్యవసాయ ఇతర పంటల కంటే పామాయిల్ సాగు తో పాటు ఉద్యానవన పంటలకు తక్కువ పెట్టుబడి అవుతుందని చెప్పారు. ఇందులో అంతర్గత పంటలు కూడా సాగు చేసుకుని రైతులు ఆర్థికంగా అభివృద్ధి కావచ్చునని చెప్పారు.