calender_icon.png 20 July, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్లు తానే సీఎం అని ఎలా అంటారు

20-07-2025 01:24:20 AM

  1. రేవంత్‌రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ విధనాలకు వ్యతిరేకం

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన ట్వీట్

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా తానే ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి  పేర్కొనడంపై స్వపక్షంలోనే తీవ్రమైన అసంతృప్త స్వరం వినిపించింది. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఆయన పార్టీకే చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ శనివారం ట్వీట్ చేశారు. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్‌రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజాస్వా మ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉం టుంది. తెలంగాణ కాంగ్రెస్‌ను  వ్యక్తిగత సా మ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖర్సాయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఇలాంటివి సహించరు. అంటూ రాజగోపాల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించడంతో పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.