20-07-2025 12:42:50 AM
ప్రతి పని వెనుకాల ఓ కారణం ఉంటుందని మన పెద్దలు అంటుంటారు. సరిగ్గా అలానే ఓ దొంగ విషయంలో జరిగింది. ఆ దొంగ హిస్టరీ తెలుసుకుంటే ఎవ్వరైనా పాపం ఎంత కష్టమొచ్చెరా..నీకు! అనకమానరు. మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి చైన్‌స్నాచింగ్ చేసి దొరికిపోయాడు. ఓ మహిళ మెడలోని చైన్ దొంగలించడంతో నమోదైన ఈ కేసును పోలీసులు విచారించగా వారికి విస్తుపోయే నిజం తెలిసింది.
వాడు చెప్పిన కారణం విని పోలీసులే ఆశ్చర్యపోయారట. మొదటి భార్యకు భరణం చెల్లించేందుకు చైన్ దొంగలించినట్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. కోర్టు తీర్పు ప్రకారం నెలకు 6 వేల రూపాయలను మాజీ భార్యకు భరణం కింద చెల్లిచాలని తీర్పు ఇవ్వడంతో ఆమెకు చెల్లించేందుకే ఈ దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారట.
ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో పాపం ఎంత కష్టమొచ్చిందిరా నీకు...అని కొంత మంది జాలి చూపిస్తుంటే...మరి కొందరేమో విడాకులెందుకియ్యా లి... ఇలా దొంగతనాలెందుకు చేయాలనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
రమేశ్ మోతె