20-07-2025 01:29:39 AM
మంత్రి శ్రీధర్ బాబును ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో యూకేకు చెందిన స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ప్లేయర్ అయిన డాజన్ సంస్థ కొత్త సెటప్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. డాజన్ సంస్థ తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఈ కొత్త సెటప్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడంతో పాటు, విస్తరణ కోసం అదనంగా రూ. 500 కోట్ల పెట్టుబడిని ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇది తెలంగాణ రాష్ర్టంలోని సాంకేతిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు. హైదరాబాద్‌ను ఐటీ మరియు పరిశ్రమల కేంద్రంగా బలోపేతం చేయడంలో మంత్రి శ్రీధర్‌బాబు చేస్తున్న కృషిని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా కొనియాడుతూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో డాజన్ సంస్థ చూపిన నమ్మకానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.