calender_icon.png 20 July, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ తీరు మార్చుకోకుంటే బుద్ధి చెబుతాం

20-07-2025 01:26:27 AM

టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్  

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవమానకర రీతిలో మాట్లాడటాన్ని సహించబోమని, ఆయన భాష మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు కేటీఆర్ కుటుంబం లెక్కలేనన్ని వా గ్దానాలు చేసి ఏ ఒక్కటీ సరిగా నెరవేర్చలేదని బండి దుయ్యబట్టారు.

ప్ర జా ప్రయోజనాలను పక్కనబెట్టిన కేటీఆర్ కుటుంబం తెలంగాణ వనరులను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నదని విమర్శించారు. అమరవీరుల త్యాగాలకు ద్రో హం చేసిన కేటీఆర్ కుటుంబం.. తె లంగాణ ప్రజల కలలను, ఆశలను వ మ్ము చేసిందని ఆయన మండిపడ్డారు.