24 May, 2026 | 11:12 PM

సీతక్క పేరిట అక్రమ వసూళ్లు

19-04-2024 12:50 AM

మంత్రికి బహిరంగ లేఖ రాసిన ఎమ్మెల్యే పాల్వాయి

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): మంత్రి సీతక్క పేరు చెప్పి కాంగ్రెస్ నాయకులు అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అరోపించారు. గురువారం కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని స్త్రీ వైద్య నిపుణురాలిని బెదిరించి రూ.10 లక్షలు ఇవ్వాలని  కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసినట్టు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు కోనేరు కోనప్ప, రావి శ్రీనివాస్‌పై విచారణకు అదేశించాలని డిమాండ్ చేశారు.  అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నాయకులపై చర్యలు తీసుకోవాలని సీతక్కకు బహిరంగ లేఖ రాశారు. సమావేశంలో బీజేపీ నాయకులు వెంకటేశ్, అసెంబ్లీ కన్వీనర్ వీరభద్ర, ఆరుణ్ లోయ, సిందం శ్రీనివాస్, విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.