11-05-2024 12:38:18 AM
వాళ్ల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి
గతంలో కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు
తాజాగా వైరల్ అయిన వీడియో
తీవ్రంగా స్పందించిన బీజేపీ నేతలు
హస్తం పార్టీ సిద్ధాంతం ఇదేనంటూ ఆరోపణలు
అయ్యర్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని కాంగ్రెస్ ప్రకటన
న్యూఢిల్లీ, మే 10: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆ పార్టీ నేతలే వ్యవహరిస్తున్నారు. సున్నితమైన అంశాలపై ఇష్టారీతిన మాట్లాడుతూ ఆ పార్టీకి నష్టం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రవాసీ నేత సామ్ పిట్రోడా భారతీయుల భిన్నత్వంపై వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య ప్రజలు చైనీయుల వలె ఉంటారని, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లను పోలి ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కాంగ్రెస్ సమర్థిం చుకోలేకపోయింది. చివరికి పిట్రో డా రాజీనామా చేయాల్సి వచ్చింది. మరో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ గతంలో మాట్లాడిన వీడియో తాజాగా వైరల్ కావడం కాంగ్రెస్‌ను ఇరుకన పడేసింది. పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే దాయాది దేశాన్ని గౌరవించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి.
వాళ్లను రెచ్చగొడితే
ఏప్రిల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మణిశంకర్ అయ్యర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పలుసార్లు ఉగ్రవాదంపై పాకిస్థాన్‌పై పరోక్షంగా హెచ్చరికలు చేశారు. భారత్‌కు ముప్పుగా భావించే ఉగ్రవాదులు ఎక్కడికి పారిపోయినా వేటాడి మరీ హతమారుస్తామని హెచ్చరించారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూనే అయ్యర్ ఈ విధంగా మాట్లాడారు. పాకిస్థాన్‌తో మనం చర్చలు జరపాలి. కానీ, సైన్యంతో రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయి. వారిని మనం గౌరవించాలి. లేదంటే ఎవరో ఒక పిచ్చి వ్యక్తి భారత్‌పై అణుబాంబులు ప్రయోగించాలనే ఆలోచన చేస్తారు. మన దగ్గర కూడా బాంబులు ఉన్నాయి. కానీ, లాహోర్‌పై మనం అణుబాంబు ప్రయోగిస్తే, దానికి సంబంధించిన రేడియోషన్ అమృత్‌సర్ చేరేందుకు పెద్దగా సమయం పట్టదు అని మణిశంకర్ అయ్యర్ అన్నట్లు ఆ వీడియోలో ఉంది.
కాంగ్రెస్ అభిప్రాయం కాదు
అయితే, మణిశంకర్ అయ్యర్ వాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన కొన్ని నెలల కింద ఈ వ్యాఖ్యలు చేశారని, ఆయన అభిప్రాయంతో కాంగ్రెస్‌కు ఎలాంటి సం బంధం లేదని వివరించింది. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా స్పందిస్తూ .. కొన్ని నెలల క్రితం అయ్యర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పూర్తిగా విభేదిస్తోంది. కానీ, ప్రధాని మోదీ రోజూ చేస్తున్న వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడినట్లు ఉన్నారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఆయన వ్యాఖ్యలు పార్టీ విధానాలను ప్రతిబింబించదు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, 1974 లో పోఖ్రాన్ అణుపరీక్షలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. పాత వీడియోలతో కాంగ్రెస్‌ను విమర్శించాలంటే అప్పు డు బీజేపీపైనా ఆరోపణలు చేసే అవకాశముంది. ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ చైనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు అని జైశంకర్ మాట్లాడిన వీడియోను ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ సిద్ధాంతం ఇదే
కాగా, మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను బీజేపీ వ్యతిరేకించింది. ఉగ్రవా దాన్ని ప్రోత్సహించే పాకిస్థాన్‌కు ఈ వ్యాఖ్యలు క్షమాపణలు చెప్పినట్లుగా ఉందని విమర్శించింది. అయ్యర్ మాట్లాడిన వీడియోను కేంద్రమంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ షేర్ చేస్తూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అసలు సిద్ధాంతం బయటపడిందన్నారు. పాక్‌కు అండ గా నిలబడి, వాళ్ల మద్దతు పొం దుతున్నదని ఆరోపించారు. అవసరమైతే సియాచిన్‌ను వదులుకోవడం, యాసిన్ మాలిక్ వంటి ఉగ్రవాదులుకు మద్దతివ్వడం వంటివి వాళ్ల సిద్ధాంతంలో భాగమని ఆరోపించారు. దేశంలో విభజన రాజకీయాలు సృష్టించడం, అవినీతి, బడు గు బలహీనవర్గాల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ముస్లింలను బు జ్జగించడం వారి కర్తవ్యమని దుయ్యబట్టారు. కాగా, ఇటీవల పాకిస్థాన్ అణ్వా యుధాల సామర్థ్యం గురించి అయ్య ర్ కన్నా ముందు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా సైతం మాట్లాడారు. దాయాది దేశాన్ని రెచ్చగొడితే అణ్వాయుధాలతో సమాధా నమిస్తుందని ఫరూఖ్ పేర్కొనడం గమనార్హం.