20-07-2025 10:50:42 PM
ఎండి రజాక్..
కొత్తగూడెం (విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఐఎన్‌టియుసి శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి చురుగ్గా పాల్గొనాలని, ఐఎన్టియుసి కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులు ఎండి రజాక్ పిలుపునిచ్చారు. ఆదివారం విద్యానగర్ కాలనీలోని రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి సూచనలతో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి ప్రచారం చేసే విధంగా యూనియన్ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. ఐఎన్‌టియుసికి చెందిన కాంట్రాక్ట్ కార్మికులు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, కష్టపడి పనిచేసి పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని, అభివృద్ధిలో జిల్లాను పరుగులు పెట్టిస్తున్న పొంగులేటి అండగా ఉంటాడని స్థానిక సమరానికి, అందరు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.