calender_icon.png 20 July, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం నేర్పాలి

19-07-2025 07:44:23 PM

ఘట్ కేసర్: విద్యార్థులకు చిన్నతనం నుండే తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం నేర్పించాలని పిల్లల తల్లిదండ్రులు పేర్కొన్నారు. పోచారం మున్సిపల్ చౌదరిగుడలోని రోటర్ డ్యామ్ ఇంటర్ నేషనల్ స్కూల్ లో శనివారం విద్యార్థులచే ఇన్వెస్టిచర్ సెర్మనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు ఎదురయ్యే పరిస్థితులను తమ తెలివితేటలతో ఎదుర్కొని,

పరిష్కరించుకునే విషయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండే శక్తిని పెంపొందించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు తప్పక ఉపయోగపడతాయని, అందుకు ఆవిధంగా ప్రోత్సహించడానికి పాఠశాల యజమాన్యం ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. ఇందులో హమైరా సహానీ అనే విద్యార్థిని హెడ్ గర్ల్ గా, అగస్త్య అనే విద్యార్థి హెడ్ బాయ్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈకార్యక్రమానికి పాఠశాల అడ్వైజర్ వాసుదేవ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా పాఠశాల డైరెక్టర్ శ్వేతారెడ్డి ప్రధానోపాధ్యాయురాలు కె. కృపారెడ్డి పాల్గొని బాల బాలికలను అభినందించారు.