calender_icon.png 21 July, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విచారణ పూర్తయ్యేన్నా?

21-07-2025 12:16:29 AM

  1. నెల దాటిన జిల్లా కలెక్టర్ 

టేబుల్ పై మూలుగుతున్న ఫైల్

చర్యలు లేకపోవడంపై పలు అనుమానాలు

నిధులు దోచుకున్న వాళ్ళు దర్జాగా విధుల్లో.. రూల్ బుక్ వీరికి వర్తించదా..!

అధికారుల తీరుపైన అనుమానం 

వ్యక్తం చేస్తున్న స్థానికులు.

పెన్ పహాడ్, జూలై 20 : ఒకప్పుడు పెన్ పహాడ్ లోని ప్రాధమిక ఆరోగ్యం కేంద్రంలోని సర్కారు వైద్యమంటేనే ప్రజల్లో నమ్మకం ఉండేది.. జిల్లాలేనే కాదు రాష్ట్రంలోనే పెన్ పహాడ్ (పీ హెచ్ సీ)కి మంచి గుర్తిపు వచ్చింది. అప్పట్లో ఈ ఆసుపత్రి ఎలా ఉందో చూద్దామని ఏకంగా అప్పటి గవర్నర్ నరసింహన్, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో కలసి సందర్శించారు. రాష్ట్రంలో ఉన్న సర్కారు ఆసుపత్రిలన్ని ఇలా ఉండాలి..

వైద్యం అందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని.. ఇంత కృషి చేసిన అప్పటి స్థానిక వైద్యాధికారి డాక్టర్ దాచేపల్లి సుధీర్ కుమార్ ను ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్ పెర్కోనండంతో రాష్ట్రంలోని సర్కారు ఆసుపత్రి వైద్యులే కాదు ఏకంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పెన్ పహాడ్ పీ హెచ్ సీని సందర్శించడంతో పర్యాటక కేంద్రంలా మారింది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాదు.. దోపిడి కేంద్రం..!

ఇదిలా ఇలా ఉంటే అప్పటి వైద్యాధికారి బదిలీపై వెళ్ళడంతో ప్రస్తుతం ఈ ఆసుపత్రికి పరిశుభ్రత జబ్బు, దోపిడి జబ్బు పట్టుకుంది. అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో ఇష్టా రాజ్యంగా మారింది. కొందరు సిబ్బంది విధులకు రాక పోయినా హాజరు వేసుకోవడం తో.. కొందరు సిబ్బంది ఆసుపత్రి బాధ్యుల మద్య కుదిరిన ఒప్పందంతో నేడు ఈ ఆసుపత్రి పరిస్థితి అబాసుపాలైంది.

తాజాగా దీనిపై విచారణ చేస్తే ప్రజా సొమ్ము లక్షల రూపాయలు రికవరి చేయవచ్చని కొందరు బాహటంగానే చెబుతున్నారు. అంతేకాదు  మరో దోపిడీ విషయానికి వస్తే గత కొన్ని నెలల నుంచి సిబ్బంది, వైద్యాధికారి స్రవంతి మద్య ఆధిపత్య పోరు రగిలింది.

ఈ పోరులో నగదు దుర్వినియోగం వివాదం బట్ట బయలు అయింది. ఏకంగా సిబ్బంది నుంచి ఎంటీ చెక్లు తీసుకొని ప్రజా సొమ్మును స్వంత అకౌంట్లలోకి మార్చుకుంటూ లక్షల రూపాయలు దుర్వినియోగం చేసినందుకు సిబ్బంది ఇదేమని అడిగితే బెదిరింపులు గురిచేస్తూన్నారని వైద్యాధికారి స్రవంతి, హెచ్ ఈ ఓ చంద్రశేఖర్ రాజుపై ఏకంగా జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఐకు ఫిర్యాదు చేశారు.

ఆరోపనలు ఎదుర్కోంటున్న వైద్యాధికారి తనపైనే సిబ్బంది ఫిర్యాధు ఇచ్చినందుకు తాను డ్యూటీ చేయలేక పోతున్నా.. సిబ్బంది సహకరించడం లేదని’ జిల్లా కలెక్టర్ తేజస్ నం దులాల్ పవార్కు మొరపెట్టుకుంటూ బోరు న విలపించగానే విచారణకు ఆదేశించారు కలెక్టర్.

ఈమేరకు జూన్ 12న విచారణ నిమిత్తం డిప్యూటీ డీఎంహెచ్ కోటిరత్నం. సిబ్బంది విచారణ చేశారు. ప్రాథమిక విచారణలో నిధులు దుర్వినియోగం అయినట్లు.. సమగ్ర నివేదిక’ అందజేస్తున్నట్లు పత్రిక ముఖంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

ఒక్క ఫోన్ కాల్.. గాలిలో కలిసిన చర్యలు..?

ప్రస్తుతం జిల్లాలో విద్య, వైద్య శాఖలో ప్రక్షాళన దిశగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ద పెట్టారని అందులో భాగంగానే ఈశాఖల్లో ఆకస్మిక తణిఖీలు విస్తుతంగా చేపడుతున్నట్లు.. ఈశాఖలు కొంత గాడీల పడుతున్నా యనే విషయం సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం. కానీ విధుల్లో అలసత్వం పక్కన పెడితే నిధుల దుర్వినియోగంపై బట్టబయలు అయినట్టు ఆరోపనలపై విచారణ జరిపి నెల దాటుతున్న ఆఫైల్ కలెక్టర్ టేబుల్ పై ఉందని..

ఆఫైల్ పై చర్యలు ఏమీ తీసుకోక పోవడం వెనుక ప్రజల్లో పలు అనుమానాలు రేకితిస్తున్నాయి . మండల వైద్యాధికారి సోదరుడు ఓ ప్రజా ప్రతినిధి వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా ఉండి ఇందులో ఇన్వాల్వ్ కావడంతోనే ఆఫైల్ తెరుచుకోలేదని.. దీంతో చర్యలు శూన్యంగా మిగిలి పోయాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈశాఖ.. ఆశాఖాని కాదు ఎవరైనా అలసత్వం చేసినా..

నిధులు దుర్వినియోగం చేసినా వారు చేస్తే తప్పు కానప్పుడు మేం చేస్తే తప్పు ఎలా ఉంటందని మండలంలోని పలు ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులు చర్చించుకోవడం కొస మెరుపు. అంతేకాదు ప్రజా పాలనలో తప్పులు చేసినా చూసి చూడనట్లుగా ఫైరవీల పలుకుబడులు ఉంటాయని మండల ప్రజలు చెప్పకనే చెబుతున్నారు. 

దోచుకున్న ఘనులకు రూల్ బుక్ వర్తించదా..?

ప్రజా సొమ్మును స్వంత అంకౌట్లలో జమ చేసుకున్నట్లు తేటతెల్లం అయిన విషయం దోచుకున్న ఘనులే విచారణలో పేర్కొన్నారు. విధుల్లో అలసత్వం జరిగితేనే డిసెప్లేన్ కింద జీతం నిలుపుదల, ఇంక్రిమెంట్లు, సస్పెన్షన్ వేటు చర్యలు సర్వసా ధారణం. ఇలాంటివి జరిగితే కొంత లేటు అయినా ఏమైందో.. పోనిలే అని  వదిలివేస్తారు.

ఏకంగా ప్రజా సొత్తును లక్షల్లో దుర్వినియోగం చేసిన వారిపై ఇంత వరకు చర్యలు లేక పోవడంపై పలు అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. వీరికి రూల్ బుక్ ప్రకారం సర్వీస్ రూల్స్, కండక్ట్ రూల్స్, రికవరి యాక్ట్ వర్తించవా...ని ప్రజల్లోనే కాదు మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలోని సిబ్బందికి కూడా అనుమానాలు మిన్నంటాయి.

విచారణ నివేదిక అందించా..

వైద్యాధికారి స్రవంతి, ఏఎన్‌ఎం మద్య వివాదం విషయంలో కలెక్టర్, డీఎంహెచ్ ఆదేశాల మేరకు విచారణ చేసి తుది నివేదిక కలెక్టర్ అందజేశా. క్రమశిక్షణ చర్యలపై కలెక్టర్ చేతులో ఉంది. విధుల్లో అలసత్వం వహించినా, నిధులు దుర్విని యోగం చేసినా శిక్షార్హులు కాక తప్పదు. అతి త్వరలో చర్యలు ఉంటాయి.

 డిప్యూటీ డీఎంహెచ్ కోటిరత్నం