calender_icon.png 20 July, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

20-07-2025 04:32:51 PM

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో వసంత(28)కు 'ఓ పాజిటివ్' రక్తం అవసరం కావడంతో ఆదివారం సింగరాయపల్లి గ్రామానికి చెందిన మిరుదొడ్డి శ్రీనివాస్ సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, 18 సంవత్సరాల క్రితం ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయాలని ఉద్దేశంతో రక్తదాన కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. మూడు సంవత్సరాల నుండి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి నాలుగు వేల యూనిట్లను అందజేసి చిన్నారుల ప్రాణాలను కాపాడడం జరిగిందని అన్నారు. రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడి తోటి వారి ప్రాణాలను కాపాడడానికి ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంకం బాలకిషన్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.