రాహుల్‌ను ప్రధాని చేయాల్సిన బాధ్యత మనదే
l మోదీ తమ్ముడు కేసీఆర్.. వారిద్దరు కవల పిల్లలు
l ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
l కబ్జాలు చేసిన వ్యక్తిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు
l ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణాల ను తృణప్రాయంగా అర్పిస్తున్న తరుణంలో సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చిందని.. ఆమె రుణం తీర్చుకోవడానికి రాబోయే పార్లమెం ట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపించుకుందామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాల్సిన నైతిక బాధ్యత మనందరిపై ఉన్నదని చెప్పారు. గురువారం వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ కవలపిల్లలు అని అన్నారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణను పదేండ్ల కింద కేసీఆర్ చేతిలో పెడితే 8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చాడని మండిపడ్డారు. కాంగ్రె స్ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తామని, ఇప్పటికే 5 గ్యారెంటీలను అమలు చేశామని స్పష్టంచేశారు. రాహుల్ ప్రధాని అయిన వెంటనే నిరుద్యోగుల కోసం 30లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తారని చెప్పా రు. ఎంపీ అభ్యర్థి మల్లురవి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ.. మోదీ దేశానికి చేసిందేమీ లేదని అన్నారు.
కబ్జాలు చేసిన వ్యక్తిని ఇంట్లో..
భూకబ్జాలకు పాల్పడిన వ్యక్తిని వనపర్తి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సమక్షంలో చేరండి.. ఎమ్మెల్యే మేఘారెడ్డి సమక్షంలో వద్దు అని నిరంజన్‌రెడ్డికి సూచించారు. తమ మధ్య తగాదాలు పెట్టే పద్ధతి మానుకోవాలని హెచ్చరించారు. ఈ సమా వేశంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేశ్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, పట్టణ పార్టి అధ్యక్షులు చీర్ల చందర్, కౌన్సిలర్లు విభూతినారాయణ, తదితరులు పాల్గొన్నారు.






