19-07-2025 07:18:00 PM
జనగామ (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో ఏసిపి ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్(DCP Rajamahendra Naik) జనగామ జిల్లాలో పోగొట్టుకున్న 57 మంది బాధితులకు మొబైల్ ఫోన్లను రికవర్ చేసి అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో డీసీపీ మాట్లాడుతూ.. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకొని పూర్తి వివరాలు నమోదు చేసి మీ సేవలో చలాన్ కట్టాలని అన్నారు.
ఒకవేళ పోగొట్టుకున్న వ్యక్తులకు పరిజ్ఞానం లేని ఎడల ఎలా నమోదు చేయాలని ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక పోలీస్ అధికారిని సిఈఐఆర్ పోర్టల్ బాధ్యత అధికారిగా నియమించడం జరిగిందని, పోర్టల్ లో వివరాలు అన్ని గోప్యంగా ఉంచబడతాయని దీనివల్ల కోల్పోయిన సెల్ ఫోను తిరిగి పొందే అవకాశం ఎక్కువ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పోగొట్టుకున్న మొబైల్ కు దాదాపు రికవరీ కోసం మా వంతు కృషి చేస్తామని అన్నారు. మొబైల్ రికవరీ చేసుకున్న బాధితులు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ పండరి చేతన్ నితిన్, సీఐ దామోదర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్, అన్ని మండలాల పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.