19-07-2025 07:11:42 PM
ఉద్యోగాలకు 51 మంది ప్రాథమికంగా ఎంపిక..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మారుతి ఆగ్రో టెక్ అండ్ ఫర్టిలైజర్ టెక్నాలజీ(Maruuti Agrotech And Fertilissers Technologies) మహబూబాబాద్ కంపెనీలో నిరుద్యోగులకు ఉద్యోగ నియామకం కోసం నిర్వహించిన జాబ్ మేళా సక్సెస్ అయ్యింది. 144 మంది జాబ్ మేళాకు హాజరు కాగా 51 మంది అభ్యర్థులు ప్రాథమికంగా ఎంపికయ్యారని జిల్లా ఉపాధి అధికారి టి.రజిత తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు, టీం మేనేజర్ వీరభద్రం, గ్రూప్ లీడర్ సాయి, ఉపాధి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.