20-07-2025 12:45:22 AM
ఓయూలో రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అరెస్టు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 19 (విజయక్రాంతి): బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగా ణ ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు అన్యాయం చేస్తున్నాయంటూ బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి కాలేజీ, ప్రతి విద్యార్థికి కరపత్రాల ద్వారా వివరించి చైతన్యం చేయాలనే ఉద్దేశంతో శనివారం నుంచి 5 రోజుల పాటు జంగ్ సైరన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ క్రమంలోనే ఉస్మాని యా యూనివర్సిటిలో బనకచర్ల ప్రాజెక్టు వలన తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయా న్ని విద్యార్థులకు శాంతియుతంగా వివరిస్తుండగా పోలీసులు అడ్డుకుని, విద్యార్థి నాయ కులను అరెస్టు చేశారు.
అరెస్టయిన వారిలో బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తుంగ బాలు, కడారి స్వామి యాదవ్, పడాల సతీష్, నాయకులు కిషోర్‌గౌడ్, జీడి అనిల్, నరేష్, అవినాష్, సతీష్ నాగేందర్, శ్రీకాంత్, రమేష్‌గౌడ్, నవీన్‌గౌడ్, కాటం శివ, నాగారం ప్రశాంత్, కొంపల్లి నరేష్, మిథున్ ప్రసాద్, ఎల్పుకొండ రామకృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేంద్ర రావు, అవినాష్, సాయి గౌడ్ ఉన్నారు.