calender_icon.png 20 July, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ ఏడాది చివరికి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పూర్తి చేస్తాం

20-07-2025 01:15:10 AM

  1. రైల్వే కోచ్‌లు, ఇంజన్లు, మెట్రో కోచ్, వందే భారత్ కోచ్‌ల ఉత్పత్తి 
  2. వచ్చే ఏడు ప్రారంభం నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతులు
  3. ప్రత్యక్షంగా 3000 మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి
  4. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
  5. కిషన్‌రెడ్డితో కలిసి కోచ్ ఫ్యాక్టరీ పనుల పరిశీలన

ఖాజీపేట (మహబూబాబాద్), జూలై 19 (విజయక్రాంతి): రూ.500 కోట్లతో కాజీపేటలో చేపట్టిన రేల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు ఈ సంవత్సరం చివరికి పూర్తి చేసి, 2026 ప్రారంభం నుంచి రైల్వే కోచ్‌లు, ఇంజన్‌లు, మెట్రో కోచ్, వందే భా రత్ కోచ్‌లు ఉత్పత్తి ఆరంభిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇ క్కడి నుంచి విదేశాలకు రైల్వే పరికరాలు ఎ గుమతి చేస్తామని తెలిపారు.

ఈ ఫ్యాక్టరీ ద్వా రా ప్రత్యక్షంగా 3000 మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. శనివారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూ నిట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల నుంచి కాజీపేట లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ ఉందన్నా రు. ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కోసం ప్రధాని మోదీ మెగా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు సమ్మతించినట్లు చెప్పారు.

మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు ఆశించిన మేరకు జరుగుతున్నాయని సం తృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ఇక్కడ నుంచి 150 లోకోమోటీవ్‌లు కూడా ఎగుమతి చే యడానికి ఆర్డర్ లభించినట్టు చెప్పారు. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నాలుగు విభాగాల్లో ఇంజన్లు, కోచ్‌లు, మె ట్రో, అధునాతనమైన కోచ్‌లు తయారు చే యడానికి అనువైన ఏర్పాట్లు చేశామని చె ప్పారు. ప్రపంచవ్యాప్తంగా కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మెగా ప్రాజెక్టుగా గు ర్తింపు తెచ్చే విధంగా రైల్వేశాఖ కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కోచ్ ఫ్యాక్టరీ కోసం స్థలం ఇచ్చిన రైతులకు ఉపాధి అవకాశాలు కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే ఆ అం శాన్ని రైల్వే శాఖ పరిశీలించి న్యాయం చేస్తుందనారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏ ర్పాటుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్లను ఆధునికరిస్తున్నట్లు చెప్పారు.  కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్‌రావు, ద.మ.రై జనరల్ మేజర్ ఎస్‌కే వాస్తవ, నాయకులు పాల్గొన్నారు.