calender_icon.png 20 July, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదండరెడ్డి ఊదారత

20-07-2025 01:17:43 AM

4 కోట్ల విలువ చేసే భూమి, భవనం ప్రభుత్వానికి అప్పగింత

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి)/యాచారం: వ్యవసాయ, రైతు సంక్షేమ కమి షన్ చైర్మన్ కోదండరెడ్డి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. తన చిన్నాయన మల్లారెడ్డి ఇచ్చిన భూమిని, అందులో నిర్మించిన భవనాన్ని వ్యవసాయ శాఖకు రాసిచ్చారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో ని 2వేల గజాల భూమిని వ్యవసాయ శాఖ కు కేటాయిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి భూమికి సంబంధించిన పత్రాలను శనివారం కోదండరెడ్డి అందజేశా రు. ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్ లో రూ.4కోట్లకు పైగానే ఉంటుందని స మాచారం.

నెలరోజుల క్రితమే రైతు కమిషన్ బృందం, వ్యవసాయ అధికారులు కలిసి యాచారం మండలంలో పర్యటించారు. ఆ సమయంలో కోదండరెడ్డి ప్రభుత్వానికి ఇ వ్వాలనుకున్న భూమిని వ్యవసాయ శాఖ డై రెక్టర్ గోపితోపాటు మార్కెటింగ్ అధికారుల కు చూపించారు. ప్రస్తుతం ఆ స్థలంలో రైతుమిత్ర కమ్యూనిటీ భవనం ఉంది. ఇక ఆ స్థ లాన్ని, అక్కడ ఉన్న భవనాన్ని పూర్తిగా వ్యవసాయ శాఖకు రాసిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని భావించి ఈ నిర్ణ యం తీసుకున్నట్లు కోదండరెడ్డి తెలిపారు.

శనివారం సచివాలయంలో మంత్రి తుమ్మ లకు, అగ్రికల్చర్ డైరెక్టర్ గోపిలకు స్థలానికి సంబంధించిన పేపర్లను అందజేశారు. కాగా యాచారం మండలకేంద్రంలో బస్టాండ్‌కు ఆనుకునే ఉన్న ప్రైవేట్ స్థలంలో కూరగాయ ల మార్కెట్‌ను ఏర్పాటుచేయాలని రైతు క మిషన్ కోరింది. సమావేశంలో కమిషన్ స భ్యులు గోపాల్‌రెడ్డి, భవానీరెడ్డి,  అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్, కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్, ఏవోప్రసాద్ పాల్గొన్నారు.