20-07-2025 06:23:19 PM
సనత్‌నగర్ (విజయక్రాంతి): బోనాల పండుగ నేపథ్యంలో పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ(Constituency In-charge Dr. Kota Neelima) పలు ఆలయాలను సందర్శించి అమ్మవార్లకు బోనాలు సమర్పించి పూజలు చేశారు. ఇందులో భాగంగా ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి సాధారణ క్యూ లైన్ లో వెళ్లి బోనం సమర్పించి దర్శించుకున్నారు. అనంతరం సనత్ నగర్ ఏరియాలో గల సెవెన్ టెంపుల్స్ అమ్మవార్లను దర్శించుకున్నారు. తర్వాత బన్సీలాల్ పేటలోని భోలక్ పూర్ ఏరియాలో గల అమ్మవారి ఆలయాన్ని, పద్మారావు నగర్ బస్తీలో గల అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిందన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. బోనాల విజయవంతానికి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో పక్కడ్బందీగా ఏర్పాట్లు చేసిందన్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేశారన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది ఉత్సవాలు బాగా జరిగాయన్నారు. వర్షాలు సంవృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. మరోవైపు బోనాలు విజయవంతానికి ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.